Traffic Restrictions | హైదరాబాద్ : ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19న ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ పోలీసులు వెల్లడించారు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
వరంగల్ హైవే మీదుగా నగరంలోకి ప్రవేశించే లారీలు, డంపర్లు, జేసీబీలు, ట్రక్కులు, వాటర్ ట్యాంకర్లు, ఇతర వాహనాలను టయోటా షోరూమ్ వద్ద హెచ్ఎండీఏ భాగ్యలత లే అవుట్, నాగోల్ వైపు మళ్లించనున్నారు. ఎల్‌బీనగర్ నుంచి నాగోల్ వైపు వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి హెచ్ఎండీఏ, బోడుప్పల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. మల్లాపూర్ నుంచి తార్నాక, ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హబ్సిగూడ మీదుగా చర్లపల్లి – చెంగిచెర్ల వైపు మళ్లించనున్నారు.