ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ఏఎస్పీల సస్పెండ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఏఎస్పీలను సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది

  • Publish Date - March 30, 2024 / 06:16 AM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఏఎస్పీలను సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది

ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా

విధాత, హైదరాబాద్‌ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఏఎస్పీలను సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కోంటున్న ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను సస్పెండ్ చేస్తూ శనివారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇప్పటికే చంచల్‌గూడ జైలులో పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కోంటున్నారు.

ఇప్పటికే ఇదే కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులు సైతం అరెస్టై జైలులో ఉన్నారు. గత బీఆరెస్ పాలకుల అవసరాలకు అనుగుణంగా ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకుర వీరంతా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలను, జర్నలిస్టులను, చివరకు సెలబ్రెటీలను, వ్యాపారులను, రియల్టర్లను, పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి.

Latest News