మూడోసారి ప్రధానిగా మోదీకి మద్దతునివ్వండి: అమిత్ షా

దేశానికి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిని చేసేందుకు తెలంగాణ ప్రజలు ఇక్కడి నుంచి కనీసం 12ఎంపీ స్థానాల్లో గెలిపించి మద్దతునివ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా ప్రజలను కోరారు

  • Publish Date - April 25, 2024 / 05:00 PM IST

తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపించండి
సిద్ధిపేట బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

విధాత : దేశానికి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిని చేసేందుకు తెలంగాణ ప్రజలు ఇక్కడి నుంచి కనీసం 12ఎంపీ స్థానాల్లో గెలిపించి మద్దతునివ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా ప్రజలను కోరారు. అమిత్ షా గురువారం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచార సభకు హాజరై మాట్లాడారు. తాను తెలుగులో మాట్లాడలేనని.. అందుకు నేను క్షమాపణ కోరుతున్నానంటు తన ప్రసంగం మొదలుపెట్టిన అమిత్ షా మనం మళ్ళీ మోదీని ప్రధానమంత్రి నీ చెసుకోవాలంటే బీజేపీ మెజార్టీ ఎంపీలు గెలువాలని, అందుకు మీరంతా బీజేపీకి ఓటేలయాలని కోరారు.

అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, నిర్మాణ పనులు అడ్డుకునేందుకు పలు కేసులు వేసిందన్నారు. వాటన్నింటిని అధిగమించి బాలరాముడికి దివ్వ మందిరం కట్టించారన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి 70 ఏండ్ల కాశ్మీర్ సమస్యను పరిష్కరించారని తెలిపారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే కాశ్మీర్ అంతా శాశ్వతంగా భారత్‌లో అంతర్భాగమవుతుందని, అవినీతి అంతమవుతుందన్నారు. తెలంగాణలో బీఆరెస్‌, కాంగ్రెస్‌లు ఎంఐఎంకు తొత్తుగా మారి తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించడంలో అవినీతి, కుటుంబ పాలనలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లు రెండు ఒక్కటనన్నారు. అది కాళేశ్వరం లేదా మరో అవినీతి వ్యవహారం కావచ్చన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్, బీఆరెస్‌లని, వాటిని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యంమని, మెదక్ లో బీజేపీ కమలం వికసింపచేయాలంటే ఎంపీగా రఘునందన్ రావును మీరు గెలిపించాలని కోరారు.

Latest News