Uttam Kumar Reddy : అసెంబ్లీలో కృష్ణాజలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ షురూ

కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు.

Uttam Kumar Reddy

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కృష్ణజలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు మా ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్న బీఆర్ఎస్ ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతి, కాంగ్రెస్ వచ్చాక తీసుకున్న చర్యలను గణంకాలతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై 90శాతం పనులు జరిగాయని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు.

మా ప్రభుత్వ హాయాంలో కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో చుక్కనీరు బయటకు పోనివ్వదన్నారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వ హయాంలోనే నది జలాల వాటాలో రాష్ట్ర హక్కులు సమర్ధవంతంగా కాపాడబడుతున్నాయన్నారు. బీఆర్ ఎస్ వాళ్లే గొప్పగా చేశారని..మా ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.

అసెంబ్లీ చర్చను చులకనగా చేస్తున్న బీఆర్ఎస్ : మంత్రి శ్రీధర్ బాబు

కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సభలో లేరంటే అర్థమేంటని శాసన సభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు అంటే అంత చులకనగా తీసుకుంటున్నారా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కృష్ణా జాలలపైన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని, తీరా శాసన సభలో చర్చ పెడితే మాత్రం వారు డుమ్మా కొట్టారని, ఈ సమస్యపై వారి చిత్తశుద్ధి ఎంతనో అర్ధమవుతుందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

Hardik Pandya| హర్ధీక్ పాండ్య విధ్వంసక శతకం
China former mayor corruption| చైనా మాజీ మేయర్ ఇంట్లో.. టన్నుల కొద్దీ బంగారం, నగదు నిల్వలు

Latest News