YADADRI | యాదగిరి, మత్స్యగిరి గుట్టలో హనుమాన్ జయంతి ఘనంగా అభిషేక అర్చనలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పాత గుట్ట ఆలయం, వెంకటాపురం మత్స్యగిరి గుట్ట ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

విధాత : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పాత గుట్ట ఆలయం, వెంకటాపురం మత్స్యగిరి గుట్ట ఆలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయుడికి 108 కళాశాలతో పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, అలాగే అంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్య స్వామివారికి నాగవళ్ళీదలార్చన(లక్ష తమలాపాకుల పూజ), సింధూరార్చన, విశేష పుష్పార్చన నిర్వహించారు. భజనలతో, స్వామివారి నామ సంకీర్తనలతో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి పల్లకీ సేవ జరపి, భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ విష్ణు పుష్కరణి వద్ధ ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకుల పూజలు, విశేష అభిషేక, పూజలు నిర్వహించారు.

Latest News