హ‌నుమాన్ జ‌యంతి వేళ చతుర్గ్రాహి యోగం.. ఇక ఈ రాశివారికి శృంగార జీవితం ఎంతో మ‌ధురం..!

ఆంజ‌నేయుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన మంగ‌ళ‌వారం హ‌నుమాన్ జ‌యంతి రావ‌డం ఒక విశేష‌మైతే.. మ‌రో విశేషం ఏంటంటే.. ఒక రాశిలో నాలుగు గ్ర‌హాలు క‌ల‌వ‌బోతున్నాయి. ఇక ఈ రాశివారికి ఈ ఏడాదంతా ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. అంతేకాదు ఈ రాశివారి శృంగార జీవితం కూడా ఎంతో మధురంగా ఉంటుంద‌ట‌.

  • Publish Date - April 22, 2024 / 10:31 PM IST

ఈ ఏడాది జ‌రుపుకోబోయే హ‌నుమాన్ జ‌యంతి ఎంతో ప్ర‌త్యేక‌త‌తో కూడుకున్న‌ద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆంజ‌నేయుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన మంగ‌ళ‌వారం హ‌నుమాన్ జ‌యంతి రావ‌డం ఒక విశేష‌మైతే.. మ‌రో విశేషం ఏంటంటే.. ఒక రాశిలో నాలుగు గ్ర‌హాలు క‌ల‌వ‌బోతున్నాయి. ఇక ఈ రాశివారికి ఈ ఏడాదంతా ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. అంతేకాదు ఈ రాశివారి శృంగార జీవితం కూడా ఎంతో మధురంగా ఉంటుంద‌ట‌. ఈ ఒక్క‌రాశిలో నాలుగు గ్ర‌హాలు క‌ల‌వ‌డంతో మ‌రో నాలుగు రాశుల‌కు కూడా ఎంతో అదృష్ట‌మ‌ట‌. ఆ రాశుల వారికి కూడా సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ట‌.

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కుజుడు, శుక్రుడు, బుధుడి కలయిక చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. హ‌నుమాన్ జ‌యంతి(ఏప్రిల్ 23) రోజున‌ ఈ నాలుగు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నాయి. ఈ గ్రహాలు మీనరాశిలో సంచరించడంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. కుంభ రాశిని వదిలి కుజుడు ఏప్రిల్ 23వ తేదీన మీన రాశి ప్రవేశం చేస్తాడు. ఇప్పటికే అక్కడ బుధుడు, శుక్రుడు, రాహువు ఉన్నారు. వీటితో పాటు కుజుడు వచ్చి చేరడంతో నాలుగు గ్రహాల కలయికతో మీన రాశివారికి, మ‌రికొన్ని రాశుల వారికి ఎంతో సంప‌ద స‌మ‌కూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివ‌రాలు తెలుసుకుందాం..

మీన రాశి

ఏప్రిల్ 23న మీన రాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు క‌ల‌వబోతున్నారు. దీంతో ఈ రాశివారికి అష్టైశ్వ‌ర్యాలు ల‌భించ‌నున్నాయి. ఆదాయం కూడా భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. పెట్టుబ‌డుల‌కు కూడా అనుకూలం. ఇక వృత్తి ప‌రంగా నిలిచిపోయిన ప‌నులు ఊపందుకుంటాయి. దాంప‌త్య జీవితంలో ఈ రాశి వారు శృంగారం జీవితంలో మ‌ధురానుభూతి పొందుతార‌ట‌.

మిథున రాశి

మీన రాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు క‌ల‌యిక కార‌ణంగా మిథున రాశివారికి కూడా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారి క‌ల నెర‌వేర‌బోతోంది. పెట్టుబ‌డుల‌తో పాటు పొదుపు కూడా దృష్టి సారిస్తే అన్ని విధాలా మంచిది. గ్రహాల శుభ ప్రభావంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. నిలిచిపోయిన డబ్బు కూడా అందే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

క‌ర్కాట‌క రాశి వారికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆదాయం పెంచుకోవడానికి అనేక అవ‌కాశాలు ఉన్నాయి. కానీ కొన్ని విష‌యాల్లో నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది. మీరు చేస్తున్న వృత్తిలో య‌జ‌మాని నుంచి మ‌ద్ద‌తు పొంది, మ‌రింత సంపాద‌నకు అవ‌కాశం ఉంది.

వృషభ రాశి

చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందించబోతుంది. వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కుంభ రాశి

మీన రాశిలో చతుర్గ్రాహి యోగంతో పాటు గ్రహాల రాకుమారుడు బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. సుమారు 50 సంవత్సరాల తర్వాత మీన రాశిలో ఈ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. మూడు గ్రహాల కలయిక కుంభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు ఉంటాయి. ఈ సమయంలో వ్యాపార పరిస్థితి బాగుంటుంది. డబ్బు వస్తుంది. నూతన ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

Latest News