విధాత : జాతీయ పక్షి నెమలిని చంపి కూర ఎలా వండాలో వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన యూట్యూబర్ కోడం ప్రణయ్ కుమార్ నెమలికూర,అడవి పంది కూర ఇతర జంతువుల కూరలు ఎలా వండాలో వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అయితే జాతీయ పక్షి నెమలిని వేటాడటం..చంపడం చట్టపరంగా నేరం కావడంతో ఈ వీడియో వివాదస్పదమైంది. కోడం ప్రణయ్ కుమార్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు. స్పందించిన పోలీసులు ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ప్రణయ్ నెమలి కూర వండిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ కొనసాగిస్తున్నారు.