IRCTC Tourism | రాజస్థాన్ అంటనేనే అందరికీ ఆలనాటి కోటలు, పురానత ప్యాలెస్‌లు, సరస్సులు గుర్తుకువస్తాయి. ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నెలవైన ఎడారి రాష్ట్రపు అందాలను చూడాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేక టూరిస్ట్ స్పెషల్ ఎయిర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. పర్యటన మొత్తం విమానంలోనే సాగనున్నది. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఐదురాత్రులు, ఆరు రోజుల పాటు ప్యాకేజీలో పర్యటన కొనసాగుతున్నది. టూర్‌లో ఉదయ్‌పూర్, చిత్తోర్‌గఢ్, జైసల్మేర్, జోద్‌పూర్‌లో పర్యటించే అవకాశం ఉంటుంది.
పర్యటన ఇలా సాగుతుంది..
ప్యాకేజీ జనవరి 19న అందుబాటులో ఉన్నది. తొలిరోజు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయ్‌పూర్‌కు చేరుకుంటారు. హోటల్‌కు చేరుకొని లంచ్ పూర్తి చేసుకుంటారు. సిటీ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నాథాద్వారా శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బిలీఫ్ విగ్రహం (శివుడి విగ్రహం) సందర్శిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఉదయ్‌పూర్‌కి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. రెండోరోజు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని 110 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్‌గఢ్‌కు చేరుకుంటారు. అక్కడ ఫోర్ట్‌ని సందర్శిస్తారు. మళ్లీ సాయంత్రం వరకు ఉదయ్‌పూర్ చేరుకొని షాపింగ్‌కు వెళ్లవచ్చు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడురోజు ఉదయం హోటల్ చెకవుట్ చేసి జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్తారు. రాత్రి డెజర్ట్ క్యాంప్‌కి వెళ్తారు. నాలుగో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత లాంగేవాలా ఇండో – పాక్ బోర్డర్‌కి బయలుదేరి వెళ్తారు. వార్ మెమోరియల్, తనోట్ మాతా మందిరాన్ని సందర్శిస్తారు. ఇక రాత్రి మళ్లీ జైసల్మేర్ చేరుకొని అక్కడే బస చేస్తారు. ఐదోరోజు జోద్‌పూర్‌కు బయలుదేరుతారు. అక్కడే రాత్రి డిన్నర్ చేసుకొని బస చేస్తారు. ఆరో రోజు ఉదయం మెహ్రాఘఢ్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నానికి జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. దాంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ ధర ఇలా..
ఇక గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,850 ధర నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.35వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 – 11 సంవత్సరాల విత్ బెడ్‌తో కలిపి రూ.35వేలు, విత్ అవుట్ బెడ్ అయితే రూ.29,150 చెల్లిస్తే సరిపోతుంది. టూర్ ప్యాకేజీలో విమానా టికెట్లతో పాటు హోటల్‌లో బస, ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్, డెజర్ట్ క్యాంప్, ట్రావెల్ ఇన్సురెన్స్ కవర్ అవుతాయి. దర్శన టికెట్లు, లోకల్ ట్రావెల్, విమానంలో లంచ్‌కు ప్రయాణికులు ఖర్చులను భరించాల్సి ఉంటుంది. వివరాల కోసం 8287932229 నంబర్‌లో లేకపోతే ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ irctctourism.comలో సంప్రదించాలని కోరింది.