Site icon vidhaatha

IRCTC Tourism | ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌.. రూ.5,600కే షిర్డీ ప్రత్యేక ప్యాకేజీ.. టూర్‌ ఎక్కడి నుంచి అంటే..?

IRCTC Tourism | ఐఆర్‌సీటీ విజయవాడ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘సాయి సన్నిధి’ పేరుతో ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ఈ ప్యాకేజీలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్‌ చూపించనున్నది. ప్రతి మంగళవారం విజయవాడ నుంచి షిర్డీకి ట్యూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని, మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు టూర్‌ కొనసాగుతుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

టూర్‌ ఇలా..

విజయవాడ నుంచి ప్రతీ మంగళవారం షిరిడీ టూర్ ప్రారంభమవుతుంది. తొలిరోజు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 10.15 గంటలకు షిర్డీ సాయినగర్‌ రైలు ఎక్కాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు రైలు నాగర్‌సోల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిర్డీకి చేరుకుంటారు. అనంతరం సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడోరోజు ఉదయం శనిశిగ్నాపూర్‌ బయలుదేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత షిర్డీ చేరుకొని.. అక్కడి నుంచి సాయంత్రం 7.30 గంటలకు షిర్డీ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కడితే.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడ చేరుకుంటారు. దాంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఎలా..

టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు బుక్‌ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4850 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.12,280, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.6,930.. ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.5420 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.6,250, ట్విన్ షేరింగ్‌కు రూ.7,420 చెల్లించాలి. కంఫర్ట్ కేటగిరీలో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,710, ట్విన్ షేరింగ్‌కు రూ.9,880 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.6,430, ట్విన్ షేరింగ్‌కు రూ.8,470, సింగిల్ షేరింగ్‌కు రూ.14,970 చెల్లించాలి. కంఫర్ట్ కేటగిరీలో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,890, ట్విన్ షేరింగ్‌కు రూ.10,930, సింగిల్ షేరింగ్‌కు రూ.17,430 ప్రయాణికులు చెల్లించాలి. స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం.. కంఫర్ట్ క్లాస్‌కి థర్డ్ ఏసీ ప్రయాణం ఉంటుంది. ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ కానున్నాయి. వివరాలుకు irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించి ప్యాకేజీ బుక్‌ చేసుకోవచ్చు.

Exit mobile version