Site icon vidhaatha

ఎక్కడం ఎక్కింది కానీ, దిగరాలేదు.. ‘దున్నపోతు’ మొహందానికి..

వర్షం నుంచి తప్పించుకునేందుకు ఒక దున్నపోతు (Buffalo) తలపెట్టిన ప్రయత్నం ఊహించని సంఘటనకు దారితీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌళీ(Singrauli) జిల్లా దాదర్ గ్రామంలో నివసించే రామ్ సురత్ యాదవ్ ఇంటిపైకి ఓ అనూహ్యంగా దున్న ఎక్కి చిక్కుకుపోయింది. బాగా వాన పడుతోందన్న ఆదుర్దాతో ఏదోరకంగా మెట్లెక్కిన దున్నకు తర్వాత ఎలా దిగాలో అర్థం కాలేదు.

స్థానికుల కథనం ప్రకారం, కుండపోత వర్షానికి రోడ్లు నీటమునిగిన నేపథ్యంలో దున్నపోతు ఎడతెరిపి లేకుండా వర్షానికి తట్టుకోలేక తలదాచుకోవడానికి ఓ డాబా మెట్ల మీదుగా టెర్రస్​ మీదకు చేరింది. అయితే అక్కడ నుంచి దిగడం దానికి ఇబ్బందిగా మారడంతో అక్కడే చిక్కుకుపోయి, అరవడం మొదలుపెట్టింది. గమనించిన గ్రామస్థులు  అన్ని ప్రయత్నాలు చేసి, చివరకు అది రాత్రిపూట కిందపడిపోతుందనే ఆందోళనతో ఒ హైడ్రాలిక్ క్రేన్‌(Hydraulic Crane) తెప్పించి దాని సాయంతో దున్నపోతును క్షేమంగా కిందకు దించారు. ఈ ప్రాణరక్షణ వ్యవహారంపై మీరూ ఓ లుక్కేయండి..

గంటల పాటు సాగిన ఈ రిస్కీ రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చివరికి విజయవంతమైంది. క్రేన్ సహాయంతో దున్నను మెల్లగా పైకప్పు మీద నుంచి నేలపైకి దించడంతో కథ సుఖాంతమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో మంది నెటిజన్లు ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది మాత్రం హాస్యంతో స్పందిస్తున్నారు. ఒక పక్క ఆపదలో ఉన్న ప్రాణిని కాపాడిన స్థానికుల మానవత్వానికి జేజేలు పలుకగా, మరికొంత దున్న డాబా ఎక్కడం చూసి చాలామంది “ఇదో మేధావి దున్నపోతు” అంటూ జోక్స్ వేస్తున్నారు.

 

Exit mobile version