విధాత : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీ మాధురి బర్త్ డే( Birthday Party) పార్టీ కాదు అని ఎమ్మెల్సీ దువ్వాడ మాధూరి శ్రీనివాస్ (Duvvada Madhuri Srinivas)స్పష్టం చేశారు. అక్కడ నిర్వహించిన పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించిన పార్టీ అని తెలిపారు. ఈ మేరకు వారు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మీటింగ్ కోసం పార్థు అనే రియల్టర్ దీనిని అర్గనైజ్ చేశారని, ఫామ్ హౌస్ ఓనర్స్ తాము అన్ని ఫర్మిషన్లు తీసుకున్నామని పార్థుకు చెప్పడంతో సమావేశం నిర్వహించాడని దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు తెలిపారు. పార్టీ జరుగుతుండగానే రాజేంద్ర నగర్ పోలీసులు వచ్చారని, ఇక్కడ పార్టీకి లైసెన్స్ లేదని..అందుకే తాము రావడం లేదని నాకు చెప్పడం జరిగిందన్నారు. ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయా లేదా అని విచారించి సీజ్ చేశారని తెలిపారు.
చాలమంది ఆ పార్టీని మాధూరి పుట్టిన రోజు పార్టీ అని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మాధూరి పుట్టిన రోజు డిసెంబర్ 12 అని, పొరపాటున రియల్ ఎస్టేట్ పార్టీని కాస్తా మాధురి బర్త్ డే పార్టీగా పొరబడ్డారన్నారు. ఆ పార్టికి లైసెన్స్ లేదన్న సంగతి..అక్కడ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయనే సంగతి మాకు తెలియదని, తెలిస్తే వెళ్లే వాళ్లం కాదని..అక్కడ ఎలాంటి అరెస్టులు జరుగలేదని, ఫామ్ హౌస్ నిర్వాహకులపైన, పార్థుపైన పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు.
అది బర్త్ డే పార్టీ కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించిన పార్టీ
అక్కడ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయనే సంగతి మాకు తెలీదు
అసలు లైసెన్స్ లేదనే విషయం తెలిసి ఉంటే.. మేము వెళ్లే వాళ్లమే కాదు
– దువ్వాడ శ్రీనివాస్ pic.twitter.com/7xFw7ZOSDh
— PulseNewsBreaking (@pulsenewsbreak) December 12, 2025
