Bhindi Snack | షాకింగ్.. కిలో బెండకాయ ధర రూ.7200.. ఎక్కడో తెలుసా!

Bhindi Snack | సాధారణంగా కిలో బెండకాయ ధర ఎంత ఉంటుంది? రూ.50 నుంచి రూ.60వరకు ఉంటుంది. మరీ ఎక్కువ అయితే రూ.100 మించదు. కానీ రూ.7200కు కిలో బెండకాయలను అమ్మడం చూశారా?

Bhindi Snack | సాధారణంగా కిలో బెండకాయ ధర ఎంత ఉంటుంది? రూ.50 నుంచి రూ.60వరకు ఉంటుంది. మరీ ఎక్కువ అయితే రూ.100 మించదు. కానీ రూ.7200కు కిలో బెండకాయలను అమ్మడం చూశారా? అమెరికాలో సూపర్‌మార్కెట్‌కు వెళ్లిన ఓ భారతీయ యువకుడు అంత ధరకు బెండకాయలను స్నాక్స్ రూపంలో చూసి విస్మయానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. అది కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికా ఉంటున్న అశిష్ అహుజా అనే భారతీయుడు అక్కడి ఒక సూపర్‌మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ షాపింగ్ చేస్తున్న సమయంలో బెండకాయలను ఫ్రై చేసి స్నాక్స్ రూపంలో అమ్ముతుండటం గమనించాడు. వెంటనే వాటి దగ్గరకు వెళ్లాడు. ఈ కూరగాయను స్నాక్ రూపంలో విక్రయించడమే ఆశ్చర్యమంటే.. దాని ధరను చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అదే విషయాన్ని వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

వీడియో కనిపించిన ప్యాకెట్‌లో కేవలం 85 గ్రాముల సీజన్డ్, క్రిస్పీ ఫ్రైడ్ ఒక్రా (బెండకాయ) మాత్రమే ఉంది. అయితే దాని ధర 6.50 అమెరికన్ డాలర్లుగా ఉంది. అంటే మన భారత కరెన్సీలో ఇది సుమారు రూ.600కు సమానం. ఈ లెక్కన ఒక కిలో బెండకాయ స్నాక్ కొనాలంటే దాదాపు రూ.7250 ఖర్చు చేయాల్సి వస్తుందని అశిష్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

 


మన దేశంలో బెండకాయ అనేది సాధారణంగా ప్రతి ఇంట్లో వండుకునే కూరగాయ. కానీ అమెరికాలో అది బెండకాయను వేయించి, మసాలాలు జోడించి, చిన్న ప్యాకెట్‌లో ప్యాక్ చేసి ప్రీమియం స్నాక్‌గా విక్రయిస్తున్నారు. కేవలం 85 గ్రాముల ప్యాకెట్‌కు 6.50 డాలర్లు వసూలు చేస్తున్నారు. బెండకాయ మీ దగ్గర నుంచి పర్సనాలిటీ ట్యాక్స్ వసూలు చేసినట్లు ఉందని సరదాగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు పాపులర్ లేస్ చిప్స్ పెద్ద ప్యాకెట్ ధర కేవలం 2.50 డాలర్లే ఉండగా.. బెండకాయ స్నాక్ మాత్రం దాని కంటే చాలా ఖరీదుగా ఉండటం ఆశ్చర్యకరమని చెప్పాడు.

ఇప్పుడు ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. భారత్‌ నుంచి అమెరికాకు బెండకాయల ఎగుమతి చేసే వ్యాపారం చేయాలని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. బెండకాయ కూడా ఇప్పుడు ఎన్నారై అయిపోయింది., బెండకాయకు ఇంత గౌరవం విదేశాల్లోనే దక్కుతుంది అని కామెంట్ చేశారు. ఇంత ధర పెడితే మన దగ్గర దాదాపు వంద కిలోల బెండకాయ స్నాక్స్ తయారుచేసుకోవచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest News