Site icon vidhaatha

అఫ్గాన్‌లో ఏపీ కార్మికుల కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

విధాత‌: అఫ్గానిస్థాన్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి టోల్‌ ఫ్రీ నంబర్లను ప్రకటించింది. ఏపీ కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కార్మికశాఖ ఆధ్వర్యంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్టు ఆశాఖ కమిషనర్‌ రేఖారాణి స్పష్టం చేశారు. అఫ్గనిస్థాన్‌లో ఉన్న కార్మికులు, వారికి సంబంధించిన వారి వివరాలను 0866-2436314కు లేదా 91-7780339884 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కార్మిక శాఖ వెల్లడించింది. వీటికి అదనంగా మరో రెండు నెంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. +919492555089, 8977925653 నెంబర్లకు కూడా ఆఫ్గన్ కార్మికులకు సంబంధించిన వివరాలను తెలియజేయవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆఫ్గన్ లో చిక్కుకున్నవారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించినట్టు కార్మిక శాఖ వెల్లడించింది.

Exit mobile version