ఈనెల 21న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి…

-టీటీడీ చైర్మన్ రేస్ లో హేమాహేమీలు… ఈసారి కూడా రెడ్లకే చైర్మన్ పదవి ? తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ yvసుబ్బారెడ్డి పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగుస్తుంది. Yv సుబ్బారెడ్డి ప్రమోషన్ రానున్నదనీ సమాచారం. సుబ్బారెడ్డి కి రాజ్యసభ ఎంపీ గా కానీ, mlc తో మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీ కోరారనీ, అందుకు సీఎం కూడా అంగీకరించి నట్లు తెలిసింది. ఇక ఖాళీ కాబోతున్న […]

  • Publish Date - June 6, 2021 / 02:29 AM IST

-టీటీడీ చైర్మన్ రేస్ లో హేమాహేమీలు…

  • ఈసారి కూడా రెడ్లకే చైర్మన్ పదవి ?
  • తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ yvసుబ్బారెడ్డి పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగుస్తుంది. Yv సుబ్బారెడ్డి ప్రమోషన్ రానున్నదనీ సమాచారం. సుబ్బారెడ్డి కి రాజ్యసభ ఎంపీ గా కానీ, mlc తో మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీ కోరారనీ, అందుకు సీఎం కూడా అంగీకరించి నట్లు తెలిసింది. ఇక ఖాళీ కాబోతున్న టీటీడీ చైర్మన్ పదవికి రేస్ లో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేకపాటి కుటుంబంలోనే ఒకరు మంత్రిగా ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబంలోనీ వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవినీ ఇస్తే అన్ని విధాలుగా విమర్శలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోని కొందరు నాయకులు అంటున్నారు.
    అదేవిధంగా టీటీడీ చైర్మన్ పదవికి రేస్ లో మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. భూమన కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే భూమన కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం.
  • ప్రస్తుతం చైర్మన్, Eo గా, జాయింట్ ఈఓ గా ముగ్గురు రెడ్లు ఉన్నారు. దీంతో గతంలో అనేక రకాల విమర్శలు వచ్చాయి. వేంకటేశ్వర స్వామి వారిని వెంకటేశ్వరరెడ్డి గా మార్చేసారనే విమర్శలు వచ్చాయి. వాస్తవానికి ప్రతిపక్షాలు చేసే విమర్శల ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరని, అలాగని ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుందని, ఏ సమస్యనైనా తెగేదాకా లాగ కూడదని పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ cvsk sharma ను టీటీడీ చైర్మన్ గా చేస్తే ఎలా ఉంటుంది అని పార్టీ నాయకులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత ఇష్టమైన, ముఖ్యమైన అధికారిగా cvsk శర్మకు పేరుంది. అదీగాక జలయజ్ఞం శర్మ గా పిలిచేవారు. ప్రస్తుత సీఎం జగన్ కు కూడా బాగా పరిచయం అయిన అధికారి అని అంటున్నారు. తన కోసం, తన తండ్రి వైఎస్ రాశేఖరరెడ్డి కోసం సీబీఐ విచారణను ఎదుర్కొని, కోర్టుల చుట్టూ తిరిగి న వారిలో cvsk శర్మ కూడా ఒకరు. తన కోసం, తన కుటుంబం కోసం ఇబ్బందులు పడ్డ ప్రతీ ఐఏఎస్ అధికారి కీ ఏదో ఒక రూపంలో మేలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు cvsk శర్మ కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ఆయనకు ఎంతో కొంత మేలు చేసే అవకాశం వచ్చిందని కొందరు నాయకులు అంటున్నారు. ఇలా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు అనే అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

Latest News