విధాత : మనుషుల మాదిరిగానే..పక్షులు సైతం తోడు కోసం పడే తంటాలు ఆసక్తికరంగా ఉంటాయి. నెమలి తన ప్రియురాలిని ఆకర్షించేందుకు తన రెక్కలను వింతగా ముడిచి చుట్టు గింగిరాలు తిరుగుతుంటుంది. అయితే ఉత్తర అమెరికాలో సాధారణంగా కనిపించే కొంగల జాతి గ్రేట్ బ్లూ హెరాన్ అనే పక్షి మాత్రం తన ప్రియురాలిని ఆకర్షించేందుకు వేసే ఎత్తుగడ చూడటానికి గమ్మత్తుగా ఉంటుంది. నవంబర్ మాసంలో ఈ భారీ కొంగలు తమ ప్రేమయాత్రను ప్రారంభిస్తుంటాయి. ప్రియురాలిని వెతుక్కునేందుకు మగ కొంగలు తంటాలు మొదలుపెడుతాయి. ఇలా ఒక బ్లూ హెరాన్ మగ కొంగ సైప్రస్ చెట్టుపై నిలబడి ఆడ కొంగలను ఆకర్షించేందుకు బూడిద రంగు వెండి ఈకలను అటు ఇటు ఊపుతూ చిత్రమైన శబ్ధాలతో రెపరెపలాడిస్తుంటుంది. ఈ వీడియోలో ఆ మగ కొంగ చేసే విన్యాసాలు చూసేందుకు ఆ పక్షి డాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
బ్లూ హెరాన్ కొంగలుపొడవాటి కాళ్లు, మెడ, భారీ రెక్కలు, బూడిద-నీలం రంగు ఈకలకు ప్రసిద్ధి. ఈ కొంగ రెక్కలు దాదాపు 6.5 అడుగుల వరకు విస్తరిస్తుంటుంది. గ్రేట్ బ్లూ హెరాన్లు వసంతకాలంలో సంతానోత్పత్తి చేసే ఉత్తర అమెరికా పక్షు జాతులకు భిన్నంగా, దక్షిణ గ్రేట్ బ్లూ హెరాన్లు శరదృతువులో సంభోగ ఆచారాలను ప్రారంభిస్తుండటం విశేషం.
A Blue Heron flutters its silvery feathers atop a cypress as November ushers in its courtship season pic.twitter.com/axAOU6KvhT
— ASMR VIDEO (@asmrvideo_) November 13, 2025
