Site icon vidhaatha

Turtles Viral Video : తాబేళ్ల చక్రవ్యూహం..అద్బుత దృశ్యం

turtle-circle-meeting-nature-viral-video

విధాత: ప్రకృతి సమతుల్యత…జీవ వైవిధ్యంలో తాబేళ్ల మనుగడ కూడా కీలకమే. అయితే తాబేళ్ల వేట..ప్రతికూల వాతావరణాల మధ్య పలు తాబేళ్ల జాతులు అంతరించిపోతున్నాయి. సముద్రపు తాబేళ్లు, మంచినీటి తాబేళ్లు వంటి తాబేళ్ల జాతుల్లో 300కుపైగా రకాలు భూమిపై నివసిస్తున్నాయి. తాబేళ్ల సంరక్షణకు భారత్ సహా పలు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా పలు కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఓ నీటి సరస్సులో తాబేళ్లకు ఏ సమస్య వచ్చిందో ఏమోగాని అవన్ని అత్యవసరంగా భేటీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

నీటి అడుగులో ఉన్న తాబేళ్లు..చక్రం ఆకారం వరుసలో సమావేశమయ్యాయి. మధ్యలో తాబేళ్ల రాజు, మంత్రి, సేనాపతిని తలపించేలా మూడు తాబేళ్లు ఉండగా..చుట్టు పదుల సంఖ్యలో తాబేళ్లు గుండ్రటి వలయాకారంలో సమావేశమయ్యాయి. వాటన్నింటికి నాయకులుగా ఉన్న తాబేళ్లు ఏదో సూచనలు చేస్తున్నట్లుగా..అవన్ని కూడా ఆ సూచనలను శ్రద్ధగా వింటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యం ఆసక్తికరంగా ఉంది. తాబేళ్ల సమావేశం చూస్తే ఏదో యుద్ద వ్యూహం రచిస్తున్నట్లుగా కనిబడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికాందరైతే వాతావరణ మార్పులు…వచ్చే ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మంతనాలు చేస్తున్నాయని కామెంట్ చేశారు.

Exit mobile version