Site icon vidhaatha

Puri Sri Kshetra: పూరీ క్షేత్రంలో అనూహ్య విచిత్ర‌ ఘటన.. ఎగిరే జెండాను ఎత్తెకెళ్లిన గద్ద!

Puri Sri Kshetra:

పూరీ జగన్నాథ క్షేత్రంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్నాథుడు కొలువైన ఆలయం శిఖరం నీల చక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ధ (గరుడ) పట్టుకెళ్లడం వైరల్ గా మారింది. పూరీకి వచ్చే భక్తులు ఆలయ శిఖరంపైన నీలచక్రంపై నిత్యం ఎగిరే పతిత పావన జెండాను ప్రత్యేకంగా దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీ. ఆ తర్వాత జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. అంతటి పవిత్రమైన జెండాను ఓ గద్ద పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది. నిత్యం సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో జెండా మార్చే పద్దతి కొనసాగుతోంది.

భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాలను చక్రం దిగువ కడుతారు. పైన 14మూరల పావన జెండా ఎగురుతూ ఉంటుంది. అంత పవిత్రమైన జెండాను ఎన్నడూ లేనివిధంగా ఓ గరుడ పక్షి లాక్కెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టడాన్ని భక్తులు వింతగా చూశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన దేనికి సంకేతమంటూ చర్చోపచర్చల్లో భక్తులు, పండితులు మునిగిపోయారు.

Exit mobile version