Site icon vidhaatha

టీటీడీ చైర్మన్‌తో గ్యాపే టీటీడీ ఈవో బదిలీకి కారణమా?: ఏపీలో 11 మంది ఐఎఎస్‌ల బదిలీ

విధాత: ఆంధ్రప్రదేశ్ లో 11 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావును జీఏడీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మధ్య గ్యాప్ ఉందనే అంశం తెరమీదికి వచ్చింది. దీని కారణంగానే శ్యామలరావును టీటీడీ నుంచి బదిలీ చేశారా అనే చర్చ కూడా లేకపోలేదు.

ఈ ఏడాది జనవరిలో తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ ఘటనను చంద్రబాబు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. విచారణ జరిపింది. అధికారులపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు అప్పట్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తొక్కిసలాట ఘటనతోనే టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయం లేదనే అంశం అప్పట్లో ప్రచారం సాగింది.

బదిలీ అయిన ఐఎఎస్ అధికారులు
రోడ్లు, భవనాల శాఖ- కృష్ణబాబు,
రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ- ముఖేష్ కుమార్ మీనా
డీల్లీ రెసిడెంట్ కమిషనర్ – ప్రవీణ్ కుమార్,
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- అనంతరాము,
అటవీ, పర్యావరణ శాఖ సెక్రటరీ- కాంతిలాల్ దండే
మైనార్టీ, సంక్షేమ కార్యదర్శి- శ్రీధర్
కార్మిక, సంక్షేమ కార్యదర్శి-ఎం.వి. శేషగిరిబాబు
రెవిన్యూశాఖ కార్యదర్శి-ఎం. హరిజవహర్ లాల్
కుటుంబ సంక్షేమ శాఖ-సౌరబ్ గౌర్

Exit mobile version