Chandrababu Naidu On Quantum Computer : క్వాంటమ్ కంప్యూటర్ సిద్దం

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, త్వరలో అమరావతికి షిప్ మెంట్ వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు.

Chandrababu Naidu On Quantum Computer

అమరావతి : క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధం అయింది. ఇక షిప్ మెంట్ మాత్రమే మిగిలి ఉంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. గడువు లోపే అమరావతికి చర్యలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నాు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం మాట్లాడారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతందని చెప్పారు.

పెండింగ్ లోని రెవన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చామని.. గత ప్రభుత్వం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయని విమర్శించారు. నిషేధిత జాబితాలోని భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపట్టామన్నారు. లోకేశ్ ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారని.. విధిగా ఎమ్మెల్యేలందరూ ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్ స్థాయిలో అమరావతిలో భారీ ఈవెంట్లు జరుగుతున్నాయని.. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం కూడా భారీ ఈవెంట్లను ప్రొత్సహిస్తోందని.. తమన్ మ్యూజిక్ నైట్, ఇళయరాజా మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్ వంటివి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయన్నారు. భారీ ఈవెంట్లతో పాటు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామని సీఎం చంద్రబాబు తెలిపారు.