విధాత:సీఎం జగన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగు తున్నాయి.దీనికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తారు. మహి వి రాఘవ్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను ‘యాత్ర’ పేరిట తెరకెక్కించడం తెలిసిందే.కాగా,ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ జీవిత ప్రస్థానాన్ని కూడా ఆయనే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లనున్నారు.ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది.జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా కొద్దికాలం లోనే ఆలిండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో,ఈ బయోపిక్ ను పాన్ ఇండియా చిత్రంగా రూపొందిం చాలని భావిస్తున్నారు.
కాగా,ఈ సినిమాలో వైఎస్సార్ మరణానికి ముందు పరిస్థితులు,గత ఎన్నికల్లో జగన్ విజయప్రస్థానం వరకు చూపించనున్నట్టు తెలుస్తోంది.