Mithun Reddy | అమరావతి : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయటంతో మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించటంతో మిథున్ రెడ్డిన అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
మిథున్ రెడ్డి (Mithun Reddy) పిటిషన్ విచారణ సందర్భంగా అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం సిట్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి (Mithun Reddy) దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. మరోవైపు సిట్ తనను అరెస్టు చేస్తుందని గ్రహించిన మిథున్ రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి.