గన్నవరం విమానాశ్రయంలో ఏపీ నకిలీ లిక్కర్ స్కాం కేసులో ఏ1 జనార్దన్ రావు అరెస్ట్

ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అమరావతి : ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్‌ రావు ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏ2 కట్టా రాజు, ఏ12- తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు లను ఇప్పటికే అరెస్టు చేసింది. కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధించింది. ఇదే నకిలీ లిక్కర్ కేసులో జనార్థన్ రావు సోదరుడు జగన్ మోహన్ రావు కూడా అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన బాలాజీ పరారీలో ఉన్నాడు.