Voter turnout | ఏపీలో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకే 9.21 శాతం ఓటింగ్‌

Voter turnout | ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు నుంచే ఓటర్లు భారీగా క్యూలైన్‌లలో నిలబడ్డారు. ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసినా భారీ క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి. దాంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే భారీగా పోలింగ్‌ నమోదైంది. దాదాపుగా 9.21 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Voter turnout : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు నుంచే ఓటర్లు భారీగా క్యూలైన్‌లలో నిలబడ్డారు. ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసినా భారీ క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి. దాంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే భారీగా పోలింగ్‌ నమోదైంది. దాదాపుగా 9.21 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అటు ఒడిశాలో కూడా ఆంధప్రదేశ్‌ కంటే ఎక్కువగా పోలింగ్‌ నమోదవుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తొలి రెండు గంటల్లో 9.25 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఇలా ఉంటే మధ్యాహ్నానికి పోలింగ్‌ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ, ఒడిశా రెండు రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, ఇవాళ లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌తోపాటే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరుగుతున్నది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.