Site icon vidhaatha

చేనేత జౌళి శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అర్జున రావు

విధాత‌: చేనేత జౌళి శాఖ సంచాలకులుగా 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి పడాల అర్జున రావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కమీషనరేట్ లో చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న బిఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం జెసిగా బదిలీ అయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శిగా పనిచేసిన అర్జున రావు, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ గా గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సందర్భంలో ఇక్కడికి బదిలీ అయ్యారు. నూతనంగా రాజ్ భవన్ ఏర్పాటు, గవర్నర్ ప్రమాణ స్వీకారం వంటి రాజ్యాంగ బద్దమైన విషయాలలో కీలకంగా వ్యవహరించిన పడాల సుమారు సంవత్సరం పాటు ఇక్కడ సేవలు అందించారు. అనంతరం దేవాదాయ శాఖ కమీషనర్ గా బదిలీ అయిన అర్జునరావు తనదైన శైలిలో ఆ శాఖలో సంస్కరణలకు బీజం వేసారు. తాజాగా శుక్రవారం జరిగిన బదిలీలలో భాగంగా చేనేత జౌళి శాఖ సంచాలకులుగా నియమితులు కాగా, శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖ పనితీరుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆక్రమంలో అధికారులు మెరుగైన పనితీరును ప్రదర్శించాలని అదేశించారు.

Exit mobile version