Site icon vidhaatha

Chandrababu | 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

అమరావతిలో ప్రమాణ స్వీకారం

విధాత : ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఈ నెల 9న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో నాల్గవ సారి, విభజిత ఏపీలో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామి విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఫలితాలలో మొత్తం 175స్థానాల్లో ఏకంగా కూటమి 160స్థానాలకు పైగా విజయం సాధించింది. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హొదా కూడా దక్కకపోవడం గమనార్హం. టీడీపీ కూటమికి రాయలసీమ, ఉత్తరాంద్ర, కోనసీమ, పల్నాడు సహా అన్ని ప్రాంతాల్లో పూర్తి ఆధిక్యత కనబరిచింది. కూటమి దెబ్బకు వైసీపీలోని మెజార్టీ మంత్రులు చిత్తుగా ఓడిపోయారు.

Exit mobile version