విధాత: ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ఈ నెల 22వ తేదీ రాత్రి తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం గణనీయంగా పెరిగిందని దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి జరగాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లాంటి దుర్ఘటనలు, ఘర్షణలకు బహిరంగ మద్య సేవనం ప్రధాన కారణమని వివరించారు. చట్టాలలో మార్పు తెచ్చి బహిరంగ మద్య సేవనం పై కఠిన చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్టం చేయడం ద్వారా నాటుసారా,అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నివారించగలమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మద్య సేవనాన్ని నివారించగలమని తెలిపారు.గ్రామ/ వార్డు సచివాలయలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ అందించి వారి ఉద్యోగ నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని నిర్ములంచడం ఒక బాధ్యతగా పేర్కొనాలని తెలిపారు.రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ప్రభుత్వ ధ్యేయమైనా మద్య రహిత సమాజం లో భాగంగా మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.
బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం
<p>విధాత: ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ఈ నెల 22వ తేదీ రాత్రి తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం గణనీయంగా పెరిగిందని దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి […]</p>
Latest News

కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !
కింగ్ కోబ్రా తిరిగి అడవిలోకి!
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే