Site icon vidhaatha

జీవో 53,54పై హైకోర్టులో విచారణ

విధాత‌: స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జీవో 53,54 కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది మతుకుమల్లి విజయ్ కోర్టుకు తెలిపారు. వివరాలు తెలిపేందుకు రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది రెండు రోజులు గడువు కోరారు. ఇక ఇదే చివరి అవకాశమని, ఎల్లుండి తుది విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ తుది విచారణను హైకోర్టు 15కు వాయిదా వేసింది.

Exit mobile version