Site icon vidhaatha

TTD |  తిరుమలలో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు.. ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతి

విధాత, హైదరాబాద్ : తిరుమల రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుందని, దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచూ రోడ్లు దాటుతూ ఉంటాయని, భక్తుల భద్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లుగా టీటీడీ పేర్కోంది. ఆగస్టు 12 సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీవరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించనున్నట్లుగా తెలిపింది. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

Exit mobile version