Site icon vidhaatha

Mudragada | పేరుమార్పుకు దరఖాస్తు.. పవన్ ఓటమి సవాల్‌పై ముద్రగడ కీలక వ్యాఖ్యలు

విధాత : పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన మాజీ మంత్రి మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ ను ఓడిస్తామని సవాల్ చేశానని, అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పానని గుర్తు చేసుకున్నారు.

పవన్ విజయం సాధించడంతో నా సవాల్ మేరకు నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటాననిని ముద్రగడ తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకున్నానని పేర్కోన్నారు. నన్ను ఉక్మా పద్మనాభం అంటు అవమానిస్తున్నారని, పవన్ ఆయన ప్రేమించే వారితో రోజు పలావ్ చేసి పెట్టమని అప్పుడు ఆయనను పలావ్ పవన్ అని పిలుస్తామని ముద్రగడ కామెంట్ చేశారు.

Exit mobile version