Cobras Dance On Shiva Lingam : నాగుల చవితి రోజు అద్భుతం..శివలింగంపై నాగరాజులు

నాగుల చవితి రోజు నెల్లూరు జిల్లా మనుబోలులోని విశ్వనాథస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. భక్తులు పూజలు చేస్తుండగా, రెండు నాగుపాములు శివలింగంపైకి చేరుకుని పడగవిప్పి ఆడాయి. ఈ దృశ్యం చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. గతంలోనూ ఇలా జరిగిందని భక్తులు చెబుతున్నారు.

Cobras Dance On Shiva Lingam

విధాత : నాగుల చవితి రోజు అద్బుతం చోటుచేసుకుంది. తమ పండుగ రోజు అనుకున్నాయో మరి..రెండు నాగుపాములు నాగుల చవితి వేడుకలో మేం సైతం అంటూ సందడి చేశాయి. శివలింగంపై పడగవిప్పి ఆడాయి. ఈ అద్బుత ఘటన నెల్లూరు జిల్లా మనుబోలులో ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో నాగుల చవితి సందర్బంగా మహిళలు, భక్తులు అంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుడి ప్రాంగణంలోని పుట్టలో పాలు పోయడం, శివలింగానికి అభిషేక పూజలు చేస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో రెండు నాగుపాములు గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి ఆడాయి. ఈ అద్బత దృశ్యాన్ని చూసిన భక్త జనం ఆశ్చర్యం..అనందాలతో శంభో శంకర..హరహర మహాదేవ..నమో నాగరాజా అంటూ భక్తి పారవశ్యం పొందారు. కొద్దిసేపు శివలింగంపై ఆడిన నాగు పాములు ఆ తర్వాత గుడి ప్రాంగణంలోని పొదల్లోకి వెళ్లిపోయాయి. గతంలోనూ ఈ గుడిలో ఇలాంటి ఘటన జరిగిందని, అంతా శివ మహిమ అని భక్తులు చెబుతున్నారు.