Nara Lokesh | జైల్లోనే.. చంద్రబాబును చంపాలని కుట్ర: లోకేశ్‌

Nara Lokesh విధాత: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడును జైల్లోనే హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జైల్లోనే చంద్రబాబును అంతం చేసే పథకంతోనే సైకో సీఎం జగన్‌ ఆయనను ఆధారాల్లేని కేసులో అక్రమ అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా అడ్డుపడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ […]

  • Publish Date - September 21, 2023 / 12:12 PM IST

Nara Lokesh

విధాత: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడును జైల్లోనే హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జైల్లోనే చంద్రబాబును అంతం చేసే పథకంతోనే సైకో సీఎం జగన్‌ ఆయనను ఆధారాల్లేని కేసులో అక్రమ అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా అడ్డుపడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు జైల్లో భద్రత లేదని, విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు వినిపించుకోవడం లేదని, దవళేశ్వరానికి చెందిన ఖైదీ గంజేటి వీర వెంకట సత్యనారాయణ డెంగ్యూతో మరణించాడని, బాబును కూడా దోమలతో కుట్టించి చంపే కుతంత్రాలు చేస్తున్నారని అనుమానంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్‌ బాధ్యత వహించాలన్నారు.