Site icon vidhaatha

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఎన్ సీ ఎస్సీ అరుణ్ హల్దార్ స‌మావేశం

విధాత‌: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ సచివాలయంలో సమావేశమయ్యారు.గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య ఘటనకు సంబంధించి వివిధ అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

హత్యకు దారితీసిన ఘటనతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా కమిషన్ ఆరా తీసింది.ఈ సమావేశంలో కమిషన్​లోని ఇతర సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ ఇంఛార్జ్ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ హర్ష వర్ధన్, పోలీస్ శాఖ డీఐజీలు రాజకుమారి, రాజశేఖర్, గుంటూరు జిల్లా రూరల్,అర్బన్ ఎస్పీలు పాల్గొన్నారు.

Exit mobile version