విధాత: టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని తెలిపారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు. కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారని చెబుతున్నారని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు.
టీడీపీ కార్యాలయాలపై ఒకేసారి దాడి ఉద్దేశపూర్వకం
<p>విధాత: టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని తెలిపారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు. కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వైసీపీ వర్గం వారే […]</p>
Latest News

గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్-బెంగళూరు హైవే – యాక్సెస్ కంట్రోల్డ్‌గా మార్పుతో 5 గంటల్లో బెంగళూరు
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!
మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం : కవిత
ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్ జట్టు ప్రకటన
ధరణి పోర్టల్ అక్రమాలు.. భూ భారతితో రట్టు: మంత్రి పొంగులేటి
వివాదాల నుంచి వేడుకల వరకు..
సింగరేణి అక్రమాలపై భట్టి వ్యాఖ్యలు పెద్ద జోక్ : హరీష్ రావు