Andhra Pradesh | అమరావతి : సముద్ర తీరంలో అద్భుతం చోటుచేసుకుంది. తీరానికి వచ్చిన అలలు తమతో పాటు ఓ అరుదైన సుందర శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఒడ్డుకు మోసుకొచ్చాయి. ప్రకాశం జిల్లా బాపట్ల-చిన్నగంజాం మండలం మోటుపల్లి వద్ధ ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో అలల తాకిడికి తీరప్రాంతానికి శంకు చక్రాలతో కూడిన కృష్ణుడి విగ్రహం కొట్టుకొచ్చింది.
నల్లరాతితో రూపొందించిన శ్రీకృష్ణుడి విగ్రహం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన అరుదైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ విగ్రహం చరిత్ర..ఏ కాలం నాటిది..ఇన్నాళ్లుగా సముద్రంలో ఉండి ఇప్పుడు ఎలా బయటపడిందన్న దానిపై ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటూ విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు.