విధాత: ఏపీలో రేషన్ డీలర్ల పోరుబాట. జగన్ తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కన్నీళ్లు. కమిషన్లు సరిగా ఇవ్వకపోగా గోనెసంచులను తిరిగి తీసుకోవాలన్న నిర్ణయం సరికాదంటున్న డీలర్లు. జీవో10ని వెంటనే రద్దు చేయాలని, సమస్యలు పరిష్కరించకుంటే నవంబర్ నెలలో రేషన్ పంపిణీ ప్రసక్తే లేదని వెల్లడి.