Site icon vidhaatha

Road accident | మినీ ట్రక్కును ఢీకొట్టిన బొలెరో.. ఆరుగురు దుర్మరణం.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road accident : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో బొలెరో వాహనం ఎదురుగా వచ్చిన మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న ఐదుగురు, ట్రక్కు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న మినీ ట్రక్కును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో మృతదేహం కంటెయినర్‌ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మినీ ట్రక్కు రొయ్యల ఫీడ్‌తో పుదుచ్చేరి నుంచి భీమవరం వెళ్తుండగా.. బొలెరో వ్యాన్‌ తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వైపుకు వెళ్తున్నది. అయితే ముందు పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను బొలెరో డ్రైవర్‌ అతివేగంగా ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన మినీ ట్రక్కును ఢీకొట్టాడు.

Exit mobile version