విధాత: సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి తెదేపా త్రిసభ్య బృందం వెళ్లింది. తెదేపా బృందంలో గద్దె రామ్మోహన్‌రావు, చినరాజప్ప, జవహర్ ఉన్నారు. గోరంట్లను బుజ్జగించేందుకు తెదేపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గోరంట్ల డిమాండ్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆదిరెడ్డి అప్పారావుతో ఉన్న విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.