విధాత: బద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ అందించిన ప్రజలకు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు వైకాపా అభ్యర్థి దాసరి సుధ ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ పాలనకు ఈ ఫలితం నిదర్శనమని చెప్పారు.
ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో తన భర్తకు వచ్చిన మెజార్టీ కంటే ఈసారి రెట్టింపు ఆధిక్యాన్ని ఇచ్చారన్నారు. తన గెలుపునకు సహకరించిన పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే ధ్రువీకరణపత్రం అందుకున్న దాసరి సుధ
బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ ఘన విజయం సాధించడంతో కౌంటింగ్ అనంతరం అధికారులు ఆమెకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు.