కేంద్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టీకరణ
స్టీల్ ఫ్లాంట్ సందర్శన
విధాత, హైదరాబాద్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. గురువారం కుమారస్వామి విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్‌లోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్లాంట్ వివరాలను అడిగి గెలుసుకున్నారు.
I personally visited and inspected the Vizag Steel (Rashtriya Ispat Nigam-RINL) factory in Visakhapatnam, which is under the @SteelMinIndia.
During this visit, I toured various sections of the factory, gathered information, and inspected the production processes alongside senior… pic.twitter.com/BXJo51gA1a
— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) July 11, 2024
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించటం మా బాధ్యతని పేర్కోన్నారు. ప్లాంట్‌లోని అన్ని విభాగాలను పరిశీలించామని తెలిపారు. ప్రధాని ఆశీస్సులతో ప్లాంట్ వందశాతం సామర్ధ్యంతో ఉత్పత్తి చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.నాకు రెండు నెలలు సమయమివ్వండని, ప్రధాన మంత్రికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధాని తీసుకునే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కార్మికులకు ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.