నల్లమల్లలో మళ్లీ అడవి దున్న సంచారం.. పులుల అభయారణ్యంలో అనుకోని అతిధి

విభిన్న జంతుజాలలకు ఆలవాలమైన నల్లమల(పులుల అభయారణ్యం) అడవుల్లో 154ఏళ్ల తర్వాతా మరోసారి అడవిదున్న(ఇండియన్ బైసన్‌) మళ్లీ దర్శనమిచ్చింది.

  • Publish Date - July 3, 2024 / 01:06 PM IST

విధాత: విభిన్న జంతుజాలలకు ఆలవాలమైన నల్లమల(పులుల అభయారణ్యం) అడవుల్లో 154ఏళ్ల తర్వాతా మరోసారి అడవిదున్న(ఇండియన్ బైసన్‌) మళ్లీ దర్శనమిచ్చింది. నంద్యాల జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనిపించిన అడవి దున్న వీడియోలను అటవీ అధికారులు విడుదల చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధి బైర్లూటీ రేంజ్‌లో సిబ్బంది కెమెరాలో అడవి దున్న చిత్రాలు రికార్డు అయ్యాయి. 1870 తర్వాత నల్లమల్ల అడవిలో అడవి దున్న సంచారం కనిపించిందని చెబుతున్న అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

వెలుగోడు రేంజ్‌లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవి దున్నను గుర్తించామని, అదే నల్లమలకు వెళ్లినట్లుగా అటవీ శాఖ అధికారులు పేర్కోన్నారు. కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి ఈ అడవి దున్న నల్లమల అడవుల్లోకి ప్రవేశించిందని అంచనా వేస్తున్నారు. నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపించే అడవి దున్నలు నల్లమలలో సంచిరిస్తుండటంతో నల్లమల అడవులు జీవ వైవిద్యానికి నెలవుగా పేర్కోంటున్నారు.

నెలరోజుల క్రితమే వచ్చింది…

నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఈ అడవి దున్న నెల రోజుల క్రితమే ఆత్మకూర్ డివిజన్ బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్‌లలో కనిపించింది. నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు, పశ్చిమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరం దాటుకొని నల్లమల చేరడం అద్భుతమైన విషయంగా భావిస్తున్నారు. అటవీ సిబ్బందికి బైర్లూటి రేంజ్ తలమడుగు ప్రాంతంలో అడవి దున్న తొలిసారి నెలరోజుల క్రితం కనిపించినప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి పై అధికారులకు పంపించారు. వారు విషయాన్ని రహస్యంగా ఉంచారు.

అదే డివిజన్‌లోని సిబ్బందికి వెలుగోడు రేంజ్‌లో నార్త్ బీట్ వద్ధ మరోసారి కనిపించడంతో విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. అంతరించిపోత్ను అడవి దున్నను నల్లమలకు తీసుకొచ్చేందుకు ఇటీవల వరల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ) సంస్థ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. రెడ్డిస్ ల్యాబ్ ఇందుకోసం కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అడవి దున్నలను ఇతర ప్రాంతాల నుంచి నల్లమలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే అదే అక్కడికి రావడం అటవీ అధికారులను అశ్చర్యపరిచింది.

దీనిపై అటవీ శాఖ డిప్యూటీ డైరక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఆత్మకూరు అటవీ డివిజన్‌లో అడవి దున్ననరు మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారని తెలిపారు. పెద్దపులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుధీర ప్రాంతాలకు తరలి వెళ్ళడం సాధారణమేనని, ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకొని నల్లమల్ల చేరిందన్నారు. ఈ అడవీ దున్న పాపికొండలు అడవి ప్రాంతం నుంచి కృష్ణా నది మీదుగా వచ్చి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు.

Latest News