Site icon vidhaatha

YS Vijayamma | వైఎస్ ఆర్ బిడ్డ ష‌ర్మిల‌ను ఎంపీగా గెలిపించండి

వీడియోను రిలీజ్ చేసిన జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌

విధాత‌: క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు నా విన్న‌పం పేరుతో దివంగ‌త సీఎం వై ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స‌తీమ‌ణి వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ క‌డ‌ప కాంగ్రెస్ అభ్య‌ర్థి త‌న కూతురు వైఎస్ ష‌ర్మిల‌ను గెలపించాల‌ని కోరుతూ ఒక వీడియోను విడుద‌ల చేసింది. ష‌ర్మిల‌ను గెలిపించాల‌ని విజ‌య‌మ్మ విడుద‌ల చేసిన వీడియో ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైఎస్ ఆర్‌ ను అభిమానించే వారికి,ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతూ వైఎస్ ఆర్‌ బిడ్డ షర్మిలమ్మ ఎంపీ గా పోటీ చేస్తుంద‌ని, వైఎస్ ఆర్‌ బిడ్డను గెలిపించి పార్లమెంట్ కి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అని విజ‌య‌మ్మ క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.

Exit mobile version