Beuty tips | ఒంట్లో ఈ నాలుగు భాగాలకు తప్పనిసరిగా నూనె రాసుకోవాలట..!

Beuty tips | కేశాల సౌందర్యం కోసం, చర్మంపై తేమ కోసం చాలా మందికి నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం అస్సలు నూనె జోలికి వెళ్లరు. నూనె రాసుకుంటే జిడ్డుజిడ్డుగా ఉంటుందని దూరం పెడుతారు. కానీ ఒంట్లోని ఓ నాలుగు భాగాలకు మాత్రం తరచూ నూనె రాసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Publish Date - May 10, 2024 / 10:44 AM IST

Beuty tips : కేశాల సౌందర్యం కోసం, చర్మంపై తేమ కోసం చాలా మందికి నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం అస్సలు నూనె జోలికి వెళ్లరు. నూనె రాసుకుంటే జిడ్డుజిడ్డుగా ఉంటుందని దూరం పెడుతారు. కానీ ఒంట్లోని ఓ నాలుగు భాగాలకు మాత్రం తరచూ నూనె రాసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు తలకు కచ్చితంగా నూనె రాయాలట. ఇలా నిత్యం తలకు నూనె రాయడం వల్ల మెదడు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుందట. కేశాలు కూడా ఆరోగ్యంగా తయారై అందంగా కనిపిస్తాయట.

పొడిచర్మం ఉంటే ఒంటికి, కాళ్లకు, చేతులకు, ముఖాని కూడా నూనె రాసుకోవాలట. ఇలా చేయడంవల్ల శరీరం తేమగా, మృదువుగా మారుతుందట. శరీరానికి ఇలా నూనె రాసుకోవడంవల్ల ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయట.

అదేవిధంగా పడుకునేటప్పుడు మోకాళ్లకు నూనె రాసుకోవాలట. ఇలా తరచూ మోకాల్లకు నూనె రాయడంవల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట. మోకాలిలోని నరాలు, కీళ్లు ఆరోగ్యంగా తయారవుతాయట.

అంతేగాక కాలి వేళ్లు, చేతి వేళ్లకు ఉండే గోర్లకు కూడా తరచూ నూనె రాయాలట. ఇలా చేయడం వల్ల గోళ్లు తేమగా, ఆరోగ్యంగా ఉంటాయట. తరచూ నూనె రాయడంవల్ల గోళ్లు పెలుసుబారి విరిగిపోకుండా అందంగా కనిపిస్తాయట.

Latest News