Site icon vidhaatha

Breaking | జేపీఎస్ ల రెగ్యులర్ కు సీఎం కేసీఆర్ నిర్ణయం

Breaking |

విధాత : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

నాలుగేళ్ల ప్రొబేషన్ సర్వీస్ పూర్తి చేసుకుని, లక్ష్యాలను మూడింటి రెండు వంతులు పూర్తి చేసుకున్న జెపిఎస్ లను క్రమబద్ధీకరించనునట్లు తెలిపారు.

మంగళవారం నాడు సచివాలయంలో సిఎం కేసీఆర్ గారు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాల్లో… మంత్రులు కె.టి రామారావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, సుంకె రవిశంకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, సీ.ఎస్ శాంతి కుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత రావు, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, ఉపాధ్యక్షులు నేతి మంగ, యూసుఫ్ మియా, వేద పండితులు గోపికృష్ణ శర్మ, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version