మలయాళీ హీరోయిన్ అరుంధతి నాయర్ ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అరుంధతి తమిళం, మలయాళంలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ భామ సుపరచితం. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి తన సోదరుడితో కలిసి బైక్ పై వస్తున్న సమయంలో కోవలం బైపాస్ రోడ్డు పై గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో అరుంధతి తలకి తీవ్రమనైన గాయం అయింది. అర్ధరాత్రి సమయంలో గంట పాటు ఆమె రోడ్డుపై అలానే పడి ఉంది. తర్వాత ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆమెకి చికిత్స అందుతుండగా, పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని అంటున్నారు. అయితే అరుంధతి సోదరి ఆర్తి సోషల్ మీడియా వేదికగా అరుంధతికి మెరైగన చికిత్స అందించడానికి సాయం చేయాలని కోరింది.అయితే తన సోదరి ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్తి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది.. నిజంగానే తన సోదరి పరిస్థితి విషమంగా ఉందని.. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి తమ వద్ద నిజంగానే డబ్బుల్లేవని.. దాంతో ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశామని పేర్కొంది. మేము మా సోదరిని బతికించేందుకు ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటూ స్కామ్ అంటూ తమని ట్రోల్ చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది ఆర్తి.
అరుందతి స్నేహితురాలు రెమ్యా జోసెఫ్ మాట్లాడుతూ.. తమిళంలో అనేక సినిమాల్లో నటించిన తన ఫ్రెండ్‌కి తమిళ చిత్ర పరిశ్రమ, నడిఘర్ సంఘం సభ్యులు ఎవరు కూడా ఒక్క రూపాయి సాయం చేయలేదు. కనీసం తన పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అరుంధతి ట్రీట్మెంట్ పూర్తయ్యే సరికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేమని.. సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేశారని పేర్కొంది. తను కోట్లు సంపాదించడం లేదని, పరిస్థితి దారుణంగా ఉందని ఎవరైన సాయం చేయండంటూ వేడుకుంది. ఇక ఆమె పక్కటెముకలు విరిగిపోవడం.. అలాగే మెడ ఎముకలో ఫ్రాక్చర్ కావడం, తలలో రక్త కట్టడం వలన ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉంది.