రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహించాల్సిందే: హైకోర్టు సీరియస్‌

<p>విధాత: కరోనా సాకుతో రిపబ్లిక్ దినోత్సవాన్ని రాజ్‌భవన్ కే పరిమితం చేయటం సముచితం కాదన్న హైకోర్టు, గణతంత్ర వేడుకులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. గణతంత్ర వేడులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. అలాగే పరేడ్‌తో కూడిన వేడుకలను నిర్వహిస్తూ.. గణతంత్ర ఉత్సవాలకు ప్రజలను అనుమితించాలని సూచించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే… కొవిడ్‌19 కారణంగా గణతంత్ర వేడుకలను నిర్వహించలేమని, రిపబ్లిక్‌ ఉత్సవాలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర […]</p>

విధాత: కరోనా సాకుతో రిపబ్లిక్ దినోత్సవాన్ని రాజ్‌భవన్ కే పరిమితం చేయటం సముచితం కాదన్న హైకోర్టు, గణతంత్ర వేడుకులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. గణతంత్ర వేడులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది.

అలాగే పరేడ్‌తో కూడిన వేడుకలను నిర్వహిస్తూ.. గణతంత్ర ఉత్సవాలకు ప్రజలను అనుమితించాలని సూచించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

అయితే… కొవిడ్‌19 కారణంగా గణతంత్ర వేడుకలను నిర్వహించలేమని, రిపబ్లిక్‌ ఉత్సవాలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం గమనార్హం. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావటమే కాక, కోర్టు దృష్టిJR పోయింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హైకోర్టు గణతంత్ర వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆదేశించటం గమనించదగినది.

Latest News