BRS కు షాక్.. మందుల సామెల్ రాజీనామా

కేసీఅర్ మాదిగలకు అన్యాయం చేశారని ధ్వజం తుంగతుర్తిలో మళ్లీ గాదరిని గెలిపించాలన్న కేటీఆర్  భగ్గుమన్న అసమ్మతి విధాత: BRS పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ మందుల సామేల్ అధికార పార్టీకి రాజకీయంగా షాక్ ఇచ్చారు. వరుసగా గత రెండు ఎన్నికల్లోనూ తుంగతుర్తి ఎస్సి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించిన సామెల్ భంగపడ్డారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన సామెల్ కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా […]

  • Publish Date - June 30, 2023 / 12:19 PM IST

  • కేసీఅర్ మాదిగలకు అన్యాయం చేశారని ధ్వజం
  • తుంగతుర్తిలో మళ్లీ గాదరిని గెలిపించాలన్న కేటీఆర్
  • భగ్గుమన్న అసమ్మతి

విధాత: BRS పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ మందుల సామేల్ అధికార పార్టీకి రాజకీయంగా షాక్ ఇచ్చారు. వరుసగా గత రెండు ఎన్నికల్లోనూ తుంగతుర్తి ఎస్సి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించిన సామెల్ భంగపడ్డారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన సామెల్ కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తనకు తుంగతుర్తి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు.

నిన్న తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో మరోసారి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ఆయనకు అనధికారికంగా టికెట్ ఖరారు చేయడంతో సామెల్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి అన్ని ఎన్నికల్లోను పార్టీ గెలుపు కోసం పనిచేసిన తనకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదంటూ ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి బిఆర్ఎస్ పార్టీకి, సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి సంచలనం రేపారు.

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తుంగతుర్తి నుండి పోటీ చేస్తానని, ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అంతటితో ఆగకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాల్లో మాదిగలను అణిచివేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజయ్యను మంత్రివర్గం నుండి తొలగించడం మొదలుకొని పవర్ లేని మంత్రి పదవి ఇచ్చి కొప్పుల ఈశ్వర్ ని కూడా నామమాత్రం చేశారన్నారు.

అందుకే మాదిగలకు బిఆర్ఎస్ లో న్యాయం జరగదని, మాదిగలంతా బిఆర్ఎస్ కు రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మందుల సామేల్ భవిష్యత్తు రాజకీయాల క్రమంలో కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్య వహిస్తున్నారు. వాటిలో రానున్న ఎన్నికలకు తొలి అభ్యర్థిగా గాదరి కిషోర్ ను ప్రకటించగానే అసమ్మతి భగ్గుమని కీలక నేత సామేల్ పార్టీకి గుడ్ బై చెప్పడం బిఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. రిజర్వుడు నియోజకవర్గం లోనే ఈ పరిస్థితి ఉంటే ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటన మరిన్ని రాజకీయ సంచలనాలకు కారణమవుతుందన్న గుబులు బిఆర్ఎస్ కేడర్లో వ్యక్తం అవుతుంది.

Latest News