బెంగ‌ళూరులో ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు చ‌రిత్ర సృష్టించ‌బోతున్నారా..? గెలిచేదేవ‌రో మ‌రి..?

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరులోని ఆ రెండు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాలు చ‌రిత్ర సృష్టించ‌బోతున్నాయా..? ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో 73 ఏండ్ల చ‌రిత్ర‌ను చెరిపేసి.. ఏ పార్టీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతోంది..? బెంగ‌ళూరు సౌత్, బెంగ‌ళూరు నార్త్ నుంచి బ‌రిలోకి దిగిన ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు గెల‌బోతున్నారా..? ఒక వేళ వారిద్ద‌రూ గెలిస్తే బెంగ‌ళూరు నుంచి ఎన్నికైన తొలి మ‌హిళా ఎంపీలుగా రికార్డు సృష్టించ‌నున్నారు.

  • Publish Date - March 28, 2024 / 03:57 AM IST

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరులోని ఆ రెండు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాలు చ‌రిత్ర సృష్టించ‌బోతున్నాయా..? ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో 73 ఏండ్ల చ‌రిత్ర‌ను చెరిపేసి.. ఏ పార్టీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతోంది..? బెంగ‌ళూరు సౌత్, బెంగ‌ళూరు నార్త్ నుంచి బ‌రిలోకి దిగిన ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు గెల‌బోతున్నారా..? అనే విష‌యాల‌పై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఒక వేళ వారిద్ద‌రూ గెలిస్తే బెంగ‌ళూరు నుంచి ఎన్నికైన తొలి మ‌హిళా ఎంపీలుగా రికార్డు సృష్టించ‌నున్నారు. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం దొర‌కాలంటే జూన్ 4వ తేదీ వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని బెంగ‌ళూరు సౌత్, బెంగ‌ళూరు నార్త్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మ‌హిళా నాయ‌కురాలు ఎన్నిక కాలేదు. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బ‌ల‌మైన మ‌హిళా అభ్య‌ర్థుల‌ను ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీలో నిలిపాయి. బెంగ‌ళూరు సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి(కాంగ్రెస్), బెంగ‌ళూరు నార్త్ నుంచి శోభ క‌రంద్లాజే(బీజేపీ) బ‌రిలో ఉన్నారు. సౌమ్యా రెడ్డి ప్ర‌స్తుతం జ‌య‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా, శోభ క‌రంద్లాజే కేంద్ర మంత్రిగా ఉన్నారు. శోభ ఉడుపి చిక్‌మ‌గ‌ళూరు నుంచి పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమె త‌న స్థానాన్ని మార్చుకుని బెంగ‌ళూరు నార్త్ టికెట్ ద‌క్కించుకున్నారు.

బెంగ‌ళూరులోని మూడు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాలు బెంగ‌ళూరు సెంట్ర‌ల్, బెంగ‌ళూరు సౌత్, బెంగ‌ళూరు నార్త్‌కు ఏప్రిల్ 26న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళా ఓట‌ర్లే అధికంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. దీంతో ఆయా పార్టీలో మ‌హిళా నాయ‌కురాళ్ల‌ను బ‌రిలో దింపుతున్నారు. క‌ర్ణాటక రాష్ట్రంలోని 22 నియోజకవర్గాలు ఉండ‌గా, అందులో 17 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 

Latest News