Site icon vidhaatha

Speaker Gaddam Prasad| సుప్రీంతీర్పు చూశాక స్పందిస్తాను: స్పీకర్ గడ్డం ప్రసాద్

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం (BRS MLAS Defection)లో సుప్రీంకోర్టు ధర్మాసం ఇచ్చిన తీర్పు(Supreme Court Verdict)పూర్తిగా చూశాక దీనిపై స్పందిస్తానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పేర్కొన్నారు. గురువారం ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో స్పీకర్ ప్రసాద్ మాట్లాడారు. తీర్పు కాపీ అందాక..దానిని చదివి..న్యాయ నిపుణులతో చర్చించి దానిపై స్పందిస్తానన్నారు. తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పందిస్తానన్నారు. ఈ వ్యవహారంలో తాను దాచి పెట్టేది ఏమి లేదన్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఉన్నామని గుర్తు చేశారు. స్పీకర్, గవర్నర్, రాష్ట్రపతిల అధికారాలు, ఫిరాయింపు చట్టాలు..న్యాయస్థానాల తీర్పులు..రాజ్యాంగ వ్యవస్థల పరిమితులు వంటి అంశాలపై మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మనం విశ్లేషించుకోవాలని స్పీకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version