విధాత : భారత దేశపు మొదటి కమ్యూనిస్టు మహాసభల శతాబ్ధి ఉత్సవాలను ఈ నెల 25న కోల్ కత్తాలో నిర్వహించడం జరుగుతుందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో వందేళ్ల క్రితం మొదటి కమ్యూనిస్టు మహాసభలను యూపీలోని కాన్పూర్ లో 1925డిసెంబర్ 26,27,28తేదీల్లో నిర్వహించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మొదటి కమ్యూనిస్టుల మహాసభల శతాబ్ధి ఉత్సవాలను ఈ నెల 25న కోల్ కత్తాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం సాగించిన పోరాటాలు..సాధించిన విజయాలు, సవాళ్లను ఈ మహాసభలలో సమీక్షించుకుని..భారత దేశంలో సోషలిస్టు విప్లవంలో అవిభాజ్యమైన నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనకు పునరంకితం చేసుకునే కార్యాచరణ చర్చించడం జరుగుతుందన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ధ కాలపు అనుభవాలు, పాఠాలు..మనల్ని విజయం వైపు నడిపే మార్గదర్శకాలు కావాలని ఈ దిశగా మహాసభల కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
Avatar 3 | ‘అవతార్ 3’ మేనియా.. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జేక్ సల్లీ సెల్ఫీలు .. వైరల్ అవుతున్న AI వీడియో
Harish Rao : పంచాయతీ ఎన్నికల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు
