Bank Holidays in June | మరో రెండు రోజుల్లో మే( May ) నెల ముగుస్తుంది. జూన్( June ) నెల ఆదివారం( Sunday )తో ప్రారంభం అవుతుంది. అయితే జూన్ నెలలో బ్యాంకులకు( Banks ) వచ్చే సెలవుల( Holidays ) వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జూన్( June ) మాసంలో 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి ఖాతాదారులు( Account Holders ) అప్రమత్తంగా ఉండి.. వర్కింగ్ డేస్‌లోనే తమ పనులను పూర్తి చేసుకుంటే బెటర్.
జూన్ నెలలో ప్రధానమైన పండుగ బక్రీద్( Bakri ID ) వస్తుంది. జూన్ 7వ తేదీన బక్రీద్ పండుగ ఉండడంతో దేశ వ్యాప్తంగా బ్యాంక్‌లు మూతపడనున్నాయి. ఇక జూన్‌లో ఐదు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారం కూడా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.
బ్యాంకులకు సెలవులు ఇలా..
జూన్ 1(ఆదివారం)
జూన్ 6(శుక్రవారం) – కేరళలో బ్యాంకులు బంద్
జూన్ 7(శనివారం) – బక్రీద్
జూన్ 8 (ఆదివారం)
జూన్ 11(బుధవారం) – సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌లో బ్యాంకులు బంద్
జూన్ 14(శనివారం) – రెండో శనివారం
జూన్ 15(ఆదివారం)
జూన్ 22(ఆదివారం)
జూన్ 27 (శుక్రవారం) – ఒడిశా, మణిపూర్‌లో బ్యాంకులు బంద్
జూన్ 28(శనివారం) – నాలుగో శనివారం
జూన్ 29(ఆదివారం)
జూన్ 30(సోమవారం) – మిజోరాంలో బ్యాంకులు బంద్